telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు…

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నేడు (సోమవారం) 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా రద్దు చేశారు. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే సోమవారం(జనవరి 24)కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది.

హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. అలాగే ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసింది.

నగరవాసులు ఎంతో మంది ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణిస్తుంటారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల‌ను క‌లుపుతూ ఉన్న ఈ సేవ‌లు న‌గ‌రవాసుల‌కు సేవ‌లందిస్తున్నాయి.

అయితే సేవ‌ల్లో అంత‌రాయం కేవ‌లం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని, మంగళవారం నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా నడుస్తాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామని  రైల్వే అధికారులు తెలిపారు. 

సాంకేతిక కార‌ణాలు, ట్రాక్ మ‌ర‌మ్మ‌త్తులు ఉన్న నేప‌థ్యంలో మొత్తం 36 స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక కేవ‌లం ఎంఎంటీఎస్ సేవ‌లు మాత్ర‌మే కాకుండా విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts