telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణం: సోమారపు సత్యనారాయణ

somarapu satyanarayana

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన రజాకారుల రాజ్యాన్ని తలపిస్తోందని తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు ఆర్టీసీని తమ సొంత సంస్థలా భావించే కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.రాష్ట్రంలో పెద్ద సంస్థ అయిన ఆర్టీసీని చంపేయాలని చూడడం సరియైది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టీసీని బ్రతికించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 3 వేల 3 వందల కోట్ల నష్టంలో ఉన్న ఆర్టీసీ రోజుకు 3కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ సబ్సిడీ ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ లేదన్నారు. 10 వేల బస్సుల్లో 2 వేల బస్సులకు కాలం చెల్లిపోయినా ప్రభుత్వం కొత్త బస్సులను తెప్పించడంలో విఫలమైందన్నారు.

Related posts