telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో సమ్మె సైరన్‌ మోగనుంది..

ఏపీలో సమ్మె సైరన్‌ మోగనుంది. కొత్త పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. సమ్మెతోనే తమ హక్కులను సాధించుకుంటామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. సీఎస్‌కు సమ్మె నోటీ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం సమ్మె నోటీస్‌ ఇవ్వనున్నారు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు.

ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని, చ‌ర్చ‌లు రావాల‌ని అధికార ప్ర‌భుత్వం ఆహ్వానించ‌గా…ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేద‌ని, ముందు జీవోలను వెనక్కు తీసుకోవాల‌ని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

సమ్మె నోటీసు ఇవ్వాలా.. ప్ర‌భుత్వంతొ చర్చలకు వెళ్లాలా అనేదానిపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చోపచర్చలు జరిపారు. దీంతో పాటు పీఆర్సీపై చర్చించేందుకు అసలు ప్రభుత్వం కమిటీ వేసినట్లు అధికారికంగా ఎక్కడ ఉత్తర్వులు రాలేదు. దీంతో చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య కోర్టులో హై కోర్టు లో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు CSకు నోటీసులు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Related posts