telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడే రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన ..తొలిదశ పనులు ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

రామాయపట్నం పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు (జూలై 20) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి కాసేప‌టి క్రితం సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఉన్నారు.

పోర్టు పనులకు అన్ని అనుమతులు వచ్చినందున రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ జరగనుంది. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు నేడు సీఎం జ‌గ‌న్‌ భూమిపూజ చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

పోర్టు పనులకు అన్ని అనుమతులు వచ్చినందున రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ జరగనుంది. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

రామాయపట్నం పోర్టుకు ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు అయ్యాయి. రూ.3,736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు జరగనున్నాయి. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం ఉంటుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ఉంటుంది. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల సరకు ఎగుమతి చేయనున్నారు.

రెండు దశల్లో 138.54 మిలియన్‌ టన్నులకు విస్తరిస్తారు. అప్పటికి మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం పూర్తవుతుంది. పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఈ ప్రాజెక్టు కారణంగా నెల్లూరు, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లా, సహా రాయలసీమలోని పలు జిల్లాల వాసులకు ఈ పోర్టు వరంగా మారనుంది. తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సులభతరమవుతుందని చెబుతున్నారు.ఇదే పోర్టుతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం కూడా జరుగుతుంది.

Related posts