ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఈ నెల 16న హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ కేసుకు సంబంధించి కుటుంబసభ్యులను విచారణ చేయాలని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే 11 రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతామని కోడెల కుటుంబసభ్యులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకొన్న రోజున కోడెల శివప్రసాద్ రావు ఎవరెవరికి ఫోన్ చేశాడనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకొన్న గదిని కూడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు ఇంటికి ఎవరు వచ్చినా కూడ తమకు సమాచారం ఇవ్వాలని కూడ పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా