telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పనిగంటలపై .. అభిప్రాయాలు ఇవ్వాలని.. మోడీ..

modi on brics meet in

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని గంటలు మార్చే యోచన చేస్తోంది. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికుల పని గంటలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న వర్కింగ్ సమయాన్ని పెంచనున్నారట. ఉద్యోగులకు లేదా కార్మికులకు కనీస వేతనం, దేశవ్యాప్తంగా ఒకే రోజు శాలరీ క్రెడిట్ అంశాలతో పాటు వర్కింగ్ సమయాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికుల కనీస పని గంటలు ప్రస్తుతం ఉన్న 8 గంటల నుంచి 9 గంటలకు మారనున్నాయి. వేతన కోడ్ 2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరువు భత్యం, పని గంటలు వంటి కార్మిక హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది. కనీస వేతనాలు ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ వివిధ రంగాల్లో పని చేస్తోన్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ నెలాఖరులోగా తెలియజేయాలని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని వెల్లడించింది.

ప్రస్తుత చట్టాల ప్రకారం ఎనిమిది గంటలు పని చేస్తే ఒక రోజు పనిదినంగా లెక్కిస్తున్నారు. అదనంగా భోజన విరామం అరగంట పరిగణలోకి తీసుకుంటే ఎనిమిదిన్నర గంటలు అవుతోంది. కానీ వేతన కోడ్‌లో భాగంగా సాధారణ పని రోజును 9 గంటలుగా పేర్కొంది. ఏదైనా విరామ సమయం ఎక్కువగా ఇచ్చినా రోజుకు 12 గంటలు దాటి వర్కింగ్ డేగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. జుకు 8 గంటల నుంచి 9 గంటలకు పెంపు సహా వివిధ కార్మిక ప్రమాణాలకు సంబంధించి అభిప్రాయం చెప్పవచ్చు. ఇందుకు వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు…. కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ రంజన్ ([email protected]), అసిస్టెంట్ డైరెక్టర్ బికాశ్ కుమార్ మాలిక్ ([email protected]) మెయిల్స్‌కు తమ అభిప్రాయాలు పంపించవచ్చు.

Related posts