telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పోలీసులపై దాడి చేస్తే చట్ట పరంగా చర్యలు: యూపీ ప్రభుత్వం

rjasthan corona

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకీలక నిర్ణయంతీసుకొంది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రతకు సంబంధించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బంధీగా అమలుచేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పోలీసులపై ఎవరైనా దాడి చేస్తే… అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. పోలీసులపై దాడి చేసే వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.

Related posts