కరోనా వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం అధికారిక ఉత్తర్వులు లేనిదే వార్తలు ప్రసారం చేయకూడదన్నారు. కోవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మహమ్మారిగా ప్రకటించిందన్నారు.
అసత్య వార్తలు ప్రచారం చేసి, భయాందోళనలు సృష్టించిన సదరు వ్యక్తికి ఏడాది జైలుతో పాటు జరిమానా విధించబడుతుందన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్-1995 చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.