telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కియా మోటర్స్‌ సంస్థ ప్రారంభోత్సవంలో … ఏపీసీఎం జగన్…

jagan

నేడు ఏపీ సీఎం జగన్ కియా మోటర్స్‌ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తారు. జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పదిన్నరకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కియా కార్ల పరిశ్రమకు వెళ్తారు. అనంతరం కియా గ్రాండ్‌ ఓపెనింగ్‌ వేడుకల్లో పాల్గొంటారు. ప్లాంట్‌ టూర్‌లో భాగంగా పరిపాలన విభాగం, ప్రెస్, బాడీ, పైయింట్, అసెంబ్లీంగ్, ఇంజన్‌ షాప్‌లను, టెస్ట్‌ డ్రైవర్‌ను పరిశీలిస్తారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పనలాంటి విషయాలపై కియా ప్రతినిధులతో సీఎం సమీక్షిస్తారు.

కియా కార్ల తయారీ ప్లాంటు ద్వారా నాలుగువేల శాశ్వత ఉద్యోగాలు, 7వేల తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనుంది. కార్ల పరిశ్రమకు తగినట్టుగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంచేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కియా పనిచేస్తోంది. కియాతోపాటు ఆ సంస్థ వెండార్లు ఇప్పటి వరకు 12వేల 835 మందికి ఉపాధి కల్పించాయి. అనంతపురం జిల్లాకు చెందిన 7వేల 29మందికి ఉపాధి లభించింది. కియాతోపాటు ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ కూడా అనంతపురం జిల్లాలోనే ఏర్పాటు కానున్నట్టు ప్రచారం సాగుతోంది. వెయ్యికోట్ల పెట్టుబడితో వీరా వాహన్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని సీఎంవో తెలిపింది.

Related posts