శ్రీ రమణీయం
నీ రూపం
అణువణువూ
మౌక్తిక హారం
వసంత కుసుమాభరణం
నీ నాసికాగ్ర రత్నం
నవనవోన్మేషం
నీ వలపు తలపుల్లో
మునకలు వేస్తున్నా-
అంతరిక్షంలో కొత్త గ్రహాన్ని
కనుగొనేటంత ఉత్సాహంతో-
అవనీతలంలో
ఆశల సౌధపు హద్దుల్లో
ఒద్దికగా ప్రవర్తిల్లే –
నా జీవన సహగమనీ!
ప్రణయ వింజామరైన
విదుషీమణీ!
అలకల కులుకుల
అలివేణీ!
నీ చెలిమే నాకు వరం
నీ చూపే ప్రేమ శరం
-అంశుమాలి, టెక్కలి