telugu navyamedia
క్రీడలు వార్తలు

మీ బిడ్డకు ఆసీస్ లో జన్మనివండి : బ్రెట్ లీ

Auushka-and-virat

ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ లో తలపడుతున్నాయి. అయితే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ లో జరుగుతున్న మొదటి డే-నైట్ మ్యాచ్ తర్వాత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి భారత్ కు రానున్నాడు. తన భార్య అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో… తనతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు కోహ్లీ. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించింది.  అయితే ప్రస్తుతం జరుగుతున్న డే-నైట్ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ అర్ధశతకం చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఆసీస్ పేస్ స్టార్ బ్రెట్ లీ విరుష్క దంపతులకు ఓ సలహా ఇచ్చాడు. జనవరిలో మీకు పుట్టబోతున్న బిడ్డను ఇక్కడే కనండి అని సూచించాడు. మీకు మగ బిడ్డ పుట్టిన… ఆడ బిడ్డ పుట్టిన మేము స్వాగతిస్తాము అని తెలిపాడు. అయితే విరాట్ మిగిలిన మూడు టెస్ట్ లు ఆడాలని ఆసీస్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అందరూ కోరుకుంటున్నారు. చూడాలి మరి కోహ్లీ ఏం నిర్ణయించుకుంటాడు అనేది. కోహ్లీ లేని ఆ మూడు మ్యాచ్ లు రహానే కెప్టెన్సీ భాద్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే.

Related posts