telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పూర్తి స్థాయు ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు..!!!

sonia will decide team lead in haryana

కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయా? ఇప్పుడు ఇదే ఆస‌క్తిక‌రంగా మారిపోయింది.. ఎందుకంటే.. ఈ రోజు ఉదయం 11 గంట‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జ‌ర‌గ‌బోతోంది.. పార్టీలోని విధాన‌ప‌ర‌మైన లోపాల‌ను ఎత్తిచూపుతూ లేఖ రాసిన తిరుగుబాటు నేతల ప్రతినిధులతో ఇవాళ స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది.. కరోనా వైర‌స్ నేపథ్యంలో ప్రత్యక్ష సమావేశాలు లేకుండా పోగా.. ఇదే తొలి స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం.. ఇక‌, ఈ స‌మావేశానికి సయోధ్య సంధానకర్తగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం కమలనాథ్‌.. ఇదే స‌మ‌యంలో.. కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోబుతున్నాయా? ఏఐసిసి అధ్యక్ష పదవికి ఎన్నికలు..? నిర్వ‌హించ‌నున్నారా? ఇక సోనియాగాంధీ రిటైర్ కానున్నారా?  అశోక్ గెహ్లాట్ కు ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు..!?అప్ప‌గించ‌నున్నారా? .. కోశాధికారిగా కమలనాథ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? ఇలాంటి చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి పార్టీకి పూర్తికాలపు అధ్యక్షుడు, ప్రభావవంతమైన నాయకుడు  ఉండాలంటూ లేఖ రాసిన 23 మంది సీనియర్లకు, గాంధీ కుటుంబానికి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను తీసుకున్నారు రాజకీయ దిగ్గజం కమలనాథ్‌.. ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగే ఈ కీలక సమావేశంలో పాల్గొన‌నున్నారు కాంగ్రెస్ పార్టీ “తిరుగుబాటు” నేతలు. ఆగస్టులో 23 మంది “రెబల్స్” రాసిన లేఖకు విస్తృత ప్రచారం చేసిన గులామ్ నబీ ఆజాద్ తో పాటు, ఇటీవల య‌థేఛ్చగా, బాహాటంగా, చాలా గట్టిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న కపిల్ సిబల్,  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వ్యవహరిస్తున్న  తరహాలో గాకుండా పార్టీ లో అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్యబధ్దంగా ఎన్నికలు జరగాలన్నది రెబల్స్ ఆకాంక్ష‌గా ఉంది.. ఇక, ఈ రోజు నుంచి పదిరోజులపాటు వరుసగా సమాలోచనలు జ‌ర‌గ‌నున్నాయి.. ఏఐసిసి ( అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవికి క్రమేపి  ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది అంటున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా కాంగ్రెస్ పార్టీ నూతన  అధ్యక్షుడిని ఏఐసిసి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు ఎన్నుకోనున్నారు. ఇదే స‌మ‌యంలో.. రాహుల్ గాంధీయే తిరిగి పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాలని 99.99 శాతం కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు రణదీప్ సింగ్ సూర్జేవాలా… అయితే, రాహుల్ ససేమిరా అని అంటున్నా, పార్టీ లో రాహుల్ గాంధీ అనుమతితోనే అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నార‌నే విష‌యం ఓపెన్ సీక్రెట్ అనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. మ‌రోవైపు.. మోడీని, అధికార బీజేపీని ధాటిగా ఎదుర్కొంటున్న నాయకుడిగా కూడా పార్టీలో రాహుల్ గాంధీకే మంచి గుర్తింపు ఉంది.. ఇదే స‌మ‌యంలో.. గాంధీ కుటుంబేతరులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం అనివార్యమే అయితే.. నాయ‌కుల మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మారుతుంద‌ని అంచ‌నావేస్తున్నారు. ఇవాళ జ‌రిగే స‌మావేశానికి శశిథ‌రూర్, ముకుల్ వాస్నిక్,  భూపేందర్ సింగ్ హుడా, మనీష్ తివారి, వీరప్ప మొయిలీ త‌దిత‌రులు హాజ‌రుకానున్న‌ట్టు తెలుస్తోంది. ఏఐసిసి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత యూపీఏ ఛైర్ పర్సన్ బాధ్యతలు ఎవరు స్వీక‌రిస్తార‌న్న‌దే మ‌రో ప్ర‌శ్న‌..? శరద్ పవార్ లేదా మమతా బెనర్జీయే ఆ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని చర్చ సాగుతుంది.

Related posts