telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నేడు కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష…

Kcr telangana cm

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవాళ‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో తగిన మార్పులు చేసి ముందుకెళ్లాలా? లేక సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలా? అని ఆలోచ‌న‌లో ప‌డింది స‌ర్కార్.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ‘యూజర్‌ మాన్యువల్‌’లో ఉన్న ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగించాలని, అప్పటివరకు స్లాట్ల బుకింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఏం చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ప‌డిపోయింది తెలంగాణ ప్ర‌భుత్వం. దీంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇవాళ ప్రగతిభవన్‌లో రెవెన్యూ, న్యాయశాఖ నిపుణులతో సమీక్షించనున్నారు కేసీఆర్.

అయితే రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ ఆధార్‌ నెంబరు ఇవ్వాలని రిజిస్ట్రేషన్‌ చేసే అధికారి పట్టుబట్టరాదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక వ్యక్తిని గుర్తించడానికి మరేదైనా అధికారిక పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు అని సూచించింది..  కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్‌ నంబర్లు, కులం, సామాజిక హోదా వివరాలను కోరే కాలమ్స్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించాల‌ని.. కుటుంబ సభ్యుల ఆధార్‌ వివరాలు, కుల సమాచారం అడగబోమని రాష్ట్ర ప్రభుత్వమే అండర్‌టేకింగ్‌ ఇచ్చినందున‌.. అందుకే స్లాట్‌ బుకింగ్‌కు ఈ వివరాలను కోరే ప్రస్తావనను యూజర్‌ మాన్యువల్‌ నుంచి తొలగించాల‌ని ఇక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts