telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పూరి జగన్నాథ్ కొత్త టాక్ షో…

Puri

ప్రస్తుతం లీడింగ్లో ఉన్న కొన్ని చానల్స్ తప్ప మిగతా అన్ని ఛానళ్లు టిఆర్పీ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే ఒక ప్రముఖ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక టాక్ షో ప్లాన్ చేసిందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అలాంటి మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక న్యూస్ ఛానల్ కోసం టాక్ షో చేయనున్నట్లు సమాచారం. దానికి పుడమి అనే పేరు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుందని అంటున్నారు. జాతీయ ఛానళ్లలో పాపులర్ అయిన ఒక షో లాగా దీనిని డిజైన్ చేశారని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వస్తే గానీ చెప్పలేము. ప్రస్తుతానికి దాదాపు అన్ని ఛానల్స్ కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికీ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ లు రిలీజ్ చేస్తున్నాడు. ఆయన రిలీజ్ చేసిన పోడ్కాస్ట్ లకి వస్తున్న క్రేజ్ ను ఆసరాగా చేసుకుని షోని నిర్వహించడానికి సదరు ఛానల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ముందుగా పూరి ఆసక్తి చూపించకపోయినా కొందరి మాట మేరకు ఈ షో చేయాల్సి వస్తోందని అంటున్నారు.

Related posts