ఏపీలోనూ ఈఎస్ఐ స్కామ్ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) జరిపిన తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
నేడు విజయవాడలో ప్రతీ ఫైలునూ తనిఖీ చేస్తున్నారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అటు తిరుపతిలో కూడా విజిలెన్స్ అధికారులు మరోసారి రికార్డులు పరిశీలిస్తున్నారు. అక్కడ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్కామ్‌లో అరెస్ట్ అయిన దేవికారాణి అండ్ కో బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. నాలుగో తేదీకి కోర్టు వాయిదా వేసింది.
సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి