telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో కరోనా ఉద్ధృతి..కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షలకు పైగా చేరాయి. రెండు డోసుల వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు. నిన్నటితో పోల్చితే దేశంలో కాస్త కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 

తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,064 కేసులు నమోదయ్యాయి. 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో మహమ్మారి భారిన పడి 439 మంది మృతి చెందారు.

India Coronavirus cases: Over 55k Covid-19 cases in a day for 1st time take  India's tally to over 16 lakh; death toll 35,747 | India News - Times of  India

ప్రస్తుతం దేశంలో ప్ర‌స్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75% శాతానికి చేరుకున్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. అయితే కేసులు కొంత మేర త‌గ్గుతున్నా పాజిటివిటీ రేటు భారీగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  

భారత్ లో గడిచిన 24 గంటల్లో 14,74,753 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించ‌గా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్న‌ట్లు వైద్య అధికారులు వెల్ల‌డించారు.

Omicron Coronavirus India Highlights December 14, 2021: Total New Omicron  Virus Cases in India Latest Updates, Coronavirus New Active Cases, Death  Live News, Covid-19 Vaccine Statistics and Registration India Live Count

మ‌రోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ వేగంగా జరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 162.26 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

Related posts