*ఫాంహౌస్‌లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం
*పాలనా పరమైన అంశాలతో పాటు రాష్ర్ట రాజకీయాలపై చర్చ..
*ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం..
*సీఎం మంత్రుల మీటింగ్‌లో సీఎస్..
ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అకస్మిక భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఇతరఉన్నతాధికారులు హాజరయ్యారు.
సబితా ఇద్రారెడ్డి, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కవిత హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదల, వ్యవసాయం, ఇతర అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రకటించిన కేసీఆర్ ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? నోటిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుంది? పరీక్షా తేదీలు వంటి కీలక విషయాల గురించి ఆ శాఖల మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మంత్రులతో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే సమావేశమయ్యారు.అయితే, ఆకస్మాత్తుగా భేటీ కావడంతో.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే..కేసీఆర్ షరతులు పెడుతున్నారు: వీహెచ్