telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

చుక్కలనంటిన టమాటా ధర!

tamato market

తెలంగాణలో టమాటా ధర చుక్కలనంటింది. గత పది రోజుల్లో కిలో టమాటాపై ఏకంగా రూ. 30 పెరగడంతో కేజీ టమాటా ధర ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ. 60 పలుకుతోంది. భారీ వర్షాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం వల్లే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెల చివరి వరకు ఈ ధరలే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో వినియోగించే టమాటాలో తెలంగాణలో సాగవుతున్నది 20 శాతం వరకే. మిగతా దానికోసం దిగుమతులపై ఆధారపడాల్సిందే. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లోని పంట దెబ్బతింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి టమాటా దిగుమతి అవుతోంది. ఫలితంగా ఆగస్టు తొలి వారంలో కిలో టమాటా రూ. 30 పలికింది. అయితే, లాక్‌డౌన్ సడలింపుల కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరిగింది. దీంతో ధర ఒక్కసారిగా టమాటా ధరలకు రెక్కలొచ్చాయి.ది.

Related posts