telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ నేత వీహెచ్ భేటీ

vh pawan janasena

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సుమారు గంటన్నరపాటు పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్లు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు చర్చించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయదలిచిన నేపథ్యంలో వీహెచ్, జనసేనాని పవన్ తో చర్చించారు. 

అనంతరం పవన్ మాట్లాడుతూ శ్రీశైలం, తదితర నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని, చెంచుల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పులుల సంరక్షణకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, రెండుమూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల పర్యవసానాలపై మేధావుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకుంటామని పవన్ వెల్లడించారు.

Related posts