ఏపీ సీఎం జగన్ కరోనా నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు కరోనా పరీక్షల వివరాలను జగన్ కు వివరైంచారు. టెలీ మెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు సరఫరాచేసే విధానం సమర్థవంతంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
ఇప్పటివరకు 80,334 పరీక్షలు చేయించామని అధికారులు తెలిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించారు. అధిక సగటుతో పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎం అధికారులు వెల్లడించారు. కంటైన్‌మెంట్ జోన్లనుంచే అధికంగా కేసులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్ లు సిద్ధం అవుతున్నాయన్నారు.