telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం వచ్చిందని కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు!

మన ఎప్పుడు మన శరీర ఉష్నోగ్రత కంటే.. కాస్త ఎక్కువగా వేడి ఉంటుంది.. అలానే ఉండాలి. ఆ వేడి మీదనే, మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే, మినిమం టెంపరేచర్ పొట్టలో ఉండాలి. చల్లని నీరు త్రాగగానే.. జరరాగ్ని పొట్ట చల్లారిపోతుంది. చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ సమయం.. ఉదాహరణకు 15 నిమిషాలు పట్టిందనుకోండి.. ఈ 15 నిమిషాలు పొట్టలో ప్రేగులు స్థబ్దుగా ఉండి పోతాయి. లేదా స్లో ఐపోతాయి. తిన్న ఆహారం అరగడం లేటయ్యే కొద్ది.. గ్యాస్, విష పదార్థాలు పొట్టలో తయారవుతాయి. ఇంకో విషయం ఏంటంటే? గోరు వెచ్చని నీరు త్రాగడం వల్ల పొట్టలో కొవ్వులు త్వరగా కరుగుతాయి. చల్లని నీటి వల్ల కొవ్వులు గడ్డ కట్టి జీర్ణం అవటం లేట్ అవుతుంది. భోజనం అయిన వెంటనే నీరు త్రాగరాదు. రెండు గంటల గ్యాప్ తీసుకోవాలి. తాగాలనిపిస్తే గోరువెచ్చని నీళ్లు తాగచ్చు. చలి కాలంలో బిందాలో ఉండే నీళ్లు తాగకూడదు. అతి వేడి నీళ్ళు తాగిన ప్రమాదమే. దీని వల్ల లివర్, ప్రేగులకు నష్టం వాటిల్లుతుంది.

Related posts