telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

పెట్రోల్ కంటే.. విమాన ఇంధన ధర తక్కువ…అందరూ అవే కొనుక్కోవాలా..

air fuel is cheaper than petrol

దేశంలో పెట్రోల్ ధరల కంటే విమాన ఇంధన ధరలు తక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక పక్క అతితక్కువకు చమురు ధరలు తగ్గినా కూడా, దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో క్రూడాయిల్ ధర గణనీయంగా తగ్గగా, ఇండియాలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు ఇంకా ఆకాశంలోనే ఉన్నాయి. గడచిన నెలన్నరగా ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇంటర్నేషనల్ ట్రెండ్స్ తో పోలిస్తే అది తక్కువేనని తెలుస్తోంది. ఏమంటే ఇప్పుడు ఇండియాలో పెట్రోలు ధర కన్నా విమాన ఇంధన ధరే ఎక్కువ కాబట్టి.

ప్రస్తుతం విమాన ఇంధన ధర లీటరుకు రూ. 58.07కు చేరడంతో విమానయాన సంస్థలు లాభాలను గడిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 73కు అటూఇటుగా ఉంది. అంటే, విమాన ఇంధనంతో పోలిస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 అధికంగా ఉన్నట్టు. డీజిల్ ధర రూ. 68గా ఉండగా, అది కూడా విమాన ఇంధన ధరతో పోలిస్తే రూ. 10 అధికంగా ఉంది. అక్టోబర్ 18 నుంచి ధరలు తగ్గుతూ వస్తుండగా, ఇప్పటివరకూ లీటరు పెట్రోలుపై రూ. 14.18, డీజిల్ పై రూ. 13.03 మేరకు ధర తగ్గింది. ఇక మంగళవారం నాడు కిలో లీటర్ (1000 లీటర్లు) విమాన ఇంధనంపై రూ. 9,990 మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలపడంతో విమాన ఇంధన ధర రూ. 58,060.97కు దిగి వచ్చింది. ఈ ధర పెట్రోలు, డీజిల్ కన్నా తక్కువగా ఉండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనితో అందరూ విమానాలు కొనుగోలు చేసుకోవాలా.. అంటూ ఛలోక్తులు కూడా వేస్తున్నారు.

Related posts