ప్రముఖ తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి టిక్ టాక్ ద్వారా పరిచయమై స్నేహితుడిగా మారాడు. అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా… శ్రావణి విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించగా… వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి గత ఎనిమిది సంవత్సరాల నుండి బుల్లితెరపై వచ్చే సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిశ్తోంది. తెలుగు టీవీ సీరియల్స్ అయిన మౌనరాగం, మనసు మమత, పలు సీరియళ్లలోశ్రావణి నటిస్తోంది.
previous post
next post