telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

వాట్సాప్ యూజర్లకు శుభవార్త… అతిత్వరలోనే పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి…!

whatsapp

వాట్సాప్ యూజర్లకు శుభవార్త అందింది. వాట్సాప్ వినియోగదారులు ఇకపై ఇతరులకు డబ్బులు కూడా పంపొచ్చు. అవును వాట్సాప్ ద్వారా డబ్బులు పంపే ఫెసిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో పని లేకుండానే వాట్సప్ ద్వారా డబ్బులు పంపొచ్చు. దేశవ్యాప్తంగా అతిత్వరలోనే పేమెంట్ సర్వీసులును అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ ప్రకటించింది. అంతేకాకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా తాము సర్వీసులు అందిస్తామని, దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా పేమెంట్ సర్వీసులు అందించడానికి గత ఏడాది కాలంగా తమ టీమ్ చాలా కష్టపడుతోందని వాట్సాప్ తెలిపింది. తర్వలోనే అందరికీ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కాగా వాట్సాప్ పైలెట్ ప్రాజెక్ట్ కింద కొంత మందికి పేమెంట్ సర్వీసులు అందిస్తోంది. కాగా వాట్సాప్ పేమెంట్ సర్వీసులు తొలిగా బ్రెజిల్‌లో అందబాటులోకి వచ్చాయి. కానీ అక్కడ మళ్లీ వీటిపై నిషేధం విధించారు.

Related posts