telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో నటి ఆత్మహత్యాయత్నం… ఆ ఇద్దరు ప్రముఖులే కారణమంటూ వీడియో

Vijayalakshami

తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. కొందరి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతకుముందు ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించడం సంచలనంగా మారింది.ఈ వీడియో ద్వారా ఆమె ”ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర మనోవేదనకు గురవుతున్నా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా. నా చావు కనువిప్పు కావాలి. వాళ్ళను అస్సలు వదలొద్దు” అని తెలిపింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వాళ్ళను అస్సలు వదలొద్దని తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేసింది నటి విజయలక్ష్మి. కాగా విజయలక్ష్మి తెలిపిన ‘నామ్ తమిళర్ కచ్చి’ అనేది జాతీయ పార్టీ. ఆ పార్టీ నాయడుకే సీమన్. అదేవిధంగా రాజకీయ సంస్థ ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన వ్యక్తి హరి నాడార్. అయితే ఈ ఇద్దరూ ఆమెను ఎందుకు వేధిస్తున్నారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts