మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధర్మస్థలి దేవాలయం సెట్‌ను భారీగా వేయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే శరవేగంగా సాగుతుంది. అయితే జనవరి29న విడుదలైన ఆచార్య టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలో చిరు, చరణ్‌లపై మారెడుమిల్లి అడవిలో కొన్ని కీలక సన్నివేశాలను చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఓ ఫోటో లీకైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతోంది. అక్కడ భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా ఆచార్య షూటింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనతో ఆచార్య షూటింగ్ స్పాట్ లో ఆధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ సినిమా మే 14 రానున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
next post
ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా