తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ విద్యుత్ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ సీఎండీలుగా నియమిస్తారని చెప్పారు.
కానీ కేసీఆర్ మాత్రం వారిని తొలగించి పదవీ విరమణ చేసిన వారిని సీఎండీలుగా చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావు, గోపాలరావు లాంటి వారిని సీఎండీలుగా నియమించారని అన్నారు. కేసీఆర్ చేసుకుంటున్న అడ్డగోలు ఒప్పందాలపై ఐఏఎస్‌లు సంతకాలు పెట్టకపోవడంతోనే వారిని తొలగించి రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు.