telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్యతో సమంత కొత్త సినిమా…

Samantha

కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది సమంత. సమంత తాజా సినిమా జాను మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించలేకపోయింది. అయినా.. ‘జాను’లో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. గతంలో సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related posts