ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్’ సీజన్ 3కు ఈ ఆదివారం (నవంబర్ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే గతవారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియలు ఉండవు. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీరెజా, రాహుల్, వరుణ్ సందేశ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరనే దానిపై ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. గత ఎపిసోడ్‌లో ఫినాలేకి చేరుకున్న బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్‌ల జర్నీ మొత్తాన్ని చిన్న వీడియో రూపంలో చూపించి వాళ్లని భావోద్వేగానికి గురి చేసిన సంగతి తెలిసిందే. 103వ ఎపిసోడ్‌లో శ్రీముఖి, అలీ రెజాల జర్నీ చూపించారు బిగ్ బాస్. ముందుగా శ్రీముఖిని కన్ఫెషన్ రూంకి ఆహ్వానించిన బిగ్ బాస్ ..నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, అల్లరి చేసే ఈ శ్రీముఖిని ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ప్రేమించారు. మీరు బిగ్ బాస్ ఇంట్లో చేసిన అల్లరి మిగతా సభ్యుల్లో ఉత్తేజాన్ని నింపాయి. కొన్నిసార్లు మీ ఉత్సాహం కారణంగా మిమ్మల్ని టార్గెట్ కూడా చేశారు. మీ ప్రయాణంలో మీరు నమ్మినదాన్ని తప్పు అనిపిస్తే గట్టిగా వినిపించారు. ఎన్నో ఆటుపోట్ల ప్రయాణం ఆఖరి దశకు చేరింది. ఎలాంటి ఆటుపోట్లైన ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి అని బిగ్ బాస్ తెలిపారు.
అనంతరం శ్రీముఖి తన జర్నీ మొత్తాన్ని ట్రైలర్ రూపంలో చూపించారు బిగ్ బాస్. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తన తమ్ముడు, తల్లి వచ్చిన సమయంలో ఎంత ఎమోషన్‌కి గురయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జర్నీ మొత్తాన్ని చూస్తూ చాలా భావోద్వేగానికి గురైంది శ్రీముఖి. బిగ్ బాస్ మీకు హ్యాట్సాఫ్.. ఇలాంటి ఫీలింగ్ నాకు లైఫ్‌లో ఎప్పుడూ రాదు. సూపర్ హ్యాపీగా ఉన్నా. నా లైఫ్‌లో ఎంతో కొంత సాధించానని ఈ బిగ్ బాస్ షో వల్ల కలిగింది. ఇది నా లైఫ్‌లోనే బెస్ట్ మూమెంట్. ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిపై ఉన్న బిగ్ బాస్ టాటూని ముద్దాడింది శ్రీముఖి. అలీరెజాని చివరికి కన్ఫెషన్ రూంలోకి పిలవగా, అతని ఎనర్జీ గురించి బిగ్ బాస్ ప్రశంసలు కురిపించారు. ఎంతో ఎనర్జీతో టాస్క్‌లలో పాల్గొన్న మీరు ఒక్కోసారి దాని వలనే మాటలు పడ్డారు. చివరికి ఎలిమినేట్ కూడా అయ్యారు. కాని ప్రేక్షకులు మిమల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించేలా చేశారు. మీరు దేనినైతే బలంగా నమ్ముతున్నారో దానిపైనే స్టిక్ అయి మంచి విజయాలు సాధించాలని అలీకి శుభాకాంక్షలు తెలియజేశారు బిగ్ బాస్. ఆ తర్వాత అలీ రెజా బిగ్ బాస్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఇది చూసిన అలీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇంటి సభ్యులు బిగ్ బాస్ సీజన్ 3 గురించి, ఇంటి గురించి మూడు రకాల టాస్క్‌లు చేయాల్సి ఉంటుందని తెలుపగా, కామెడీ, డ్రామా, యాక్షన్ యాడ్స్ రూపొందించారు. యాడ్స్‌కి తగ్గట్టుగా వారి వద్ద ఉన్న దుస్తులు ధరిచంచి మూడు యాడ్స్ పూర్తి చేశారు. ఇక నేడు బయటకి వెళ్లిన ఇంటి సభ్యులు అందరు హౌజ్‌లోకి ప్రవేశించనుండగా, బిగ్ బాస్ హౌజ్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది.