telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో వైరల్ : స్వప్నాచౌదరీ “రసగుల్లా” సాంగ్

Swapna-Chowdary

ప్రముఖ హరియావాణీ డాన్సర్ సప్నా చౌదరి మరోమారు తన డాన్స్‌తో దుమ్ము రేపింది. రసగుల్లాలను డిమాండ్ చేస్తూ ఆమె స్టేజ్ మీద చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటివరకూ 8 లక్షల మందికిపైగా వీక్షించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించిన స్వప్న చౌదరికి కొన్ని లక్షల మంది అభిమానులున్నారు. అమె నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటారు. సప్నా‌చౌదరి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌లలో తరచూ డాన్స్ ప్రదర్శనలు ఇస్తుంటారు. బిగ్‌బాస్ సీజన్-11లో పాల్గొన్న తరువాత ఆమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె వీడియోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి. 

Related posts