telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ విగ్రహంతో మహేష్…!

Mahesh-Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మహేష్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ తరువాత ఆయన నుంచి కొలతలు తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు విగ్రహాన్ని పూర్తి చేసి ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ముందుగా ఈ విగ్రహాన్ని అభిమానుల కోసం మహేష్ బాబు థియేటర్ “ఏఎంబి” సినిమాస్ లో ప్రదర్శనకు ఉంచారు.

మహేష్ విగ్రహాన్ని చూసేందుకు ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా “ఏఎంబి” సినిమాస్ కు భారీగా తరలివచ్చారు. మహేష్ మైనపు బొమ్మతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రత్యేక ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు తయారుచేసి ప్రతిష్ఠిస్తారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, సన్నీ లియోన్ తదితరులు స్థానం సంపాదించుకున్నారు.

 

Related posts