telugu navyamedia
సినిమా వార్తలు

“బాహుబలి-3″లో ఆసీస్ క్రికెటర్…!?

David-Warner

క్రికెట్ ప్రపంచంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్న‌ర్‌ కొన్నాళ్ళు నిషేదానికి గురై ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇచ్సినా విషయం తెలిసిందే. హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ టీం త‌ర‌పున ఆడుతూ ఆడుతూ తొలి మ్యాచ్ నుండే బౌల‌ర్ల‌ని ఉతికి పారేస్తున్నాడు. వార్న‌ర్ తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌ కు హాజ‌ర‌య్యాడు. ఈ సందర్భంగా వార్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ విలేకరి వార్న‌ర్‌ ను మీకు నటించే ఛాన్స్ వస్తే ఏ తెలుగు సినిమాలో నటిస్తారు ? అని అడిగారు. దీనికి వెంట‌నే వార్న‌ర్ “బాహుబ‌లి” అని స‌మాధానం ఇచ్చాడు. బాహుబ‌లి చిత్రానికి సీక్వెల్‌గా మూడో పార్ట్ తెరకెక్కితే అందులో న‌టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వార్న‌ర్ అన్నాడు. దర్శక ధీరుడు రూపొందించిన “బాహుబ‌లి” చిత్రం విడుద‌లై చాలా కాలం అవుతున్న‌ప్ప‌టికి ఆ మానియా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇటీవలే “అవెంజర్స్‌”లో నిక్‌ ఫ్యూరీ పాత్ర పోషించిన హాలీవుడ్ న‌టుడు జాక్సన్ కూడా త‌న‌కి “బాహుబ‌లి-3” చిత్రంలో నటించాలని ఉందనే కోరికను మీడియా ఎదుట వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

Related posts