telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దీపికా పదుకొనేకు … క్రిస్టల్‌ పురస్కారం..

Deepika-Padukone

దీపికా పదుకొనే మరో అరుదైన పురస్కారం అందుకోనుంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అందజేసే క్రిస్టల్‌ అవార్డ్‌కు దీపికా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టల్‌ పురస్కారం పొందిన నలుగురిలో దీపిక ఒకరు కావడం విశేషం. మానసిక రుగ్మతల నివావరణకు తన వంతు ప్రచారం నిర్వహిస్తున్న దీపికా కృషిని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ గుర్తించింది. మానసిక కుంగుబాటుతో కొన్నేళ్ల పాటు బాధపడిన దీపికా పదుకొనే 2015లో ద లివ్‌ లవ్‌ లాఫ్‌ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రచార కార్యక్రమాలు, చర్చా వేదికలను దేశవ్యాప్తంగా నిర్వహించింది.

మానసిక రుగ్మతలపై అవగాహన తెచ్చేందుకు దీపికా కృషి చేస్తూనే ఉంది. ఆమె సేవలకు గుర్తింపుగా క్రిస్టల్‌ అవార్డ్‌ దక్కింది. ఈ సందర్భగా దీపికా స్పందిస్తూ.క్రిస్టల్‌ అవార్డుకు ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వినయంతో వాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలతో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా. మనమంతా పైకి కనిపించకుండా సమాజంలో పెరిగిపోతున్న మానసిక సమస్యలపై మరింత బలంగా పోరాడాలి. అని చెప్పింది. త్వరలో దీపికా చపాక్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts