telugu navyamedia
సినిమా వార్తలు

“దృశ్యం 2” ఫస్ట్ లుక్ ఆ రోజే..

వెంకటేష్ దాదాపు 8 యేళ్ల క్రితం విడుద‌లైన దృశ్యం చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందిన దృశ్యం 2 చిత్రం కూడా అతి పెద్ద విజ‌యం సాధించింది. మ‌ల‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2ను తెలుగులో కూడా రీమేక్ చేశారు.

విక్టరీ వెంకటేశ్‌, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ మూవీకి జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నదియా కీలకపాత్రలో కనిపించనుంది. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని “నారప్ప” కంటే ముందే విడుదల చేయాల్సి ఉంది. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ద‌సరాకు చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్.

Drusyam 2 First Look on September 20th

ఈ సినిమాలో వెంక‌ట్ న‌టించిన రాంబాబు పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 20 న ఉదయం 10.08 గంటలకు టైటిల్ తో సహా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది.

కాగా ఇటీవ‌ల విడుద‌లైన వెంక‌టేష్ న‌టించిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందో అంద‌రికి తెలిసిందే.. ‘దృశ్యం2 చిత్రాన్ని “నారప్ప” కంటే ముందే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఓటిటికి వెళ్లాలా లేక థియేటర్లలో విడుదల చేయాలా ? అనే విషయంపై చిత్ర బృందం ఆలోచనలో పడింది. త్వరలో చిత్ర బృందం “దృశ్యం 2” విడుదల తేదీని ప్రకటించనుంది.

Related posts