telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ కు పవన్ ఆశీర్వచనం… ఆనందంలో కొత్త పెళ్ళికొడుకు

Nithin

ఈ నెల 26న హైదరాబాద్ లోని ఫలక్ నామ ప్యాలెస్ లో యంగ్ హీరో నితిన్-శాలిని వివాహం జరుగనుంది. నిశ్చితార్థ వేడుక బుధవారం కరోనాను దృష్టిలో పెట్టుకుని అతి కొద్ది మంది సమక్షంలో జరిపారు. శుక్రవారం రాత్రి నితిన్ ను పెళ్లి కొడుకు చేసే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానెంతో ఆరాధించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కావడంతో నితిన్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నితిన్ కు పవన్ ఆశీర్వచనం ఇచ్చారు. పెళ్లి సందర్భంగా నితిన్ ఇటీవల పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించినా ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నందువల్ల ఆయన వేడుకలకు హాజరవుతారా లేదా అని అందరూ సందేహించారు. అయితే తనకెంతో ఇష్టమైన అభిమాని పెళ్లి వేడుకకు పవన్ కచ్చితంగా హాజరవుతారని అభిమానులు చెబుతూ వస్తున్నారు. వారు భావించినట్లే పవన్ శుక్రవారం రాత్రి తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ (చిన్న బాబు) లతో కలిసి నితిన్ ఇంటికి వచ్చారు. నితిన్ వారికి సాదర స్వాగతం పలుకగా పెళ్లి కొడుకుగా ముస్తాబైన నితిన్ ను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆశీర్వదించారు. ‘ పెళ్ళికొడుకుని చేసిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్, చిన్న బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది.’ అని నితిన్ ట్వీట్ చేశారు.

Related posts