telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రజనీ పొలిటికల్ ఎంట్రీలో వెనక్కి తగ్గడానికి కారణం ఆయన భార్యనేనా..?

Rajinikanth actor

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యకారణాల వల్ల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు.. ఇక, దీనిపై మరో నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. అయితే, రజనీ ప్రకటనను జీర్ణించుకోలేకపోయారు ఆయన ఫ్యాన్స్‌.. ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు.. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినదించారు.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది.. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి లత రజనీకాంత్‌ పరోక్షంగా సాయం చేశారంటూ.. అభిమాన సంఘం నిర్వాహకుడు ఓ ఆడియో విడుదల చేశారు.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.  తాజాగా ఓ అడియో రిలీజ్ చేశారు తిరువాన్మియూర్‌ రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌.. దాని ప్రకారం.. రజనీ రాజకీయపార్టీ స్థాపిస్తారని గట్టి నమ్మకంతో ఎదురుచూశామని, అయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రకటిండంతో అభిమానులను నిరాశకు గురిచేసిందన్నారు. అంతేకాదు.. నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి లత రజనీకాంత్ సాయం చేసినట్టు చెప్పుకొచ్చారు.. ఆ ఆందోళన కార్యక్రమానికి వేదికను, 500 వాటర్‌ క్యాన్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు… ఇతర సహాయాన్ని పరోక్షంగా రజనీకాంత్‌ సతీమణి లత అందించారని, ఆమె అసిస్టెంట్‌ సంతోష్‌ కూడా వాటిని పరిశీలించి వెళ్లారంటూ ఆడియోలో వ్యాఖ్యానించారు భాస్కర్.. ఇప్పుడు ఇది తమిళనాడు పొలిటికల్ సర్కిల్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ చర్చగా మారింది.

Related posts