telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రాత్రివేళల్లో అరటి పండు తింటే… మీ పని అంతే !

Banana

ఆరోగ్యం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా లేకుంటే ఎలాంటి పని చేయలేము. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మనం తినే ఆహరంపై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ఇవాళ ఓ హెల్త్‌ టిప్‌ చుద్దాం. అరటి పండు, ఆపిల్‌ మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తింటే కూడా ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే.. రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. తద్వారా నిద్ర లేమి సమస్య వెంటాడుతుంది. అటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రి పూట యాపిల్‌ పండ్లను తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts