లాక్ డౌన్ సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “కరోనా వైరస్” ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం కొత్త సినిమా ‘కరోనా వైరస్’ ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. మా పనిని ఆ దేవుడితో పాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నామని ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌లో “కరోనా వైరస్” పేరుతో ఫీచర్ ఫిల్మ్ చేసినట్లు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే “కరోనా వైరస్”పై తీసిన తొలి చిత్రమిదేనని చెప్పారు. తాజాగా ఈ ట్రైలర్ పై అమితాబ్, వర్మల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్రయిలర్ ను చూసిన అమితాబ్, “అణగదొక్కేందుకు వీలులేని రామ్ గోపాల్ వర్మ… చాలా మందికి ‘రాము’, నాకు మాత్రం ‘సర్కార్’. లాక్ డౌన్ వేళ, ఆయన ఓ కుటుంబం గురించి మొత్తం సినిమాను తీశారు. దాని పేరు ‘కరోనా వైరస్’ వైరస్ పై తీసిన తొలి చిత్రం ఇదేనని భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, “థాంక్స్ సర్కార్… ఇలాంటి చుంగూ ముంగూ వైరస్ లు నన్ను లాక్ డౌన్ చేయలేవు” అని అన్నారు.
THANKS SARKAAAAR! ..I couldn’t just let a chungoo mungoo VIRUS to LOCK me DOWN https://t.co/5ru98HO4eE
— Ram Gopal Varma (@RGVzoomin) May 27, 2020