telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పలాస 1978″కు సీక్వెల్ ?

Palasa

దర్శకుడు కరుణ కుమార్ ప్రస్తుతం ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 14న ‘ఆహా’ యాప్‌లో విడుదల కానుంది. కాగా 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన ‘పలాస 1978’ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలైంది. ఇక త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్ర్కిప్ట్ రెడీ చేశారని, ఈ సీక్వెల్‌కు ‘కాశీబుగ్గ’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ‘పలాస’కు పక్కనే ఉన్న ఊరిపేరు కూడా ‘కాశీబుగ్గ’నే. అందుకే దర్శకుడు ఈ సీక్వెల్‌కు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా టాక్. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం త్వరలోనే రానుందని తెలుస్తుంది.

Related posts