టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందని, దేశానికే కేసీఆర్ దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
గతంలో ‘రైతు బంధు’ పథకం స్ఫూర్తిగా ‘పీఎం కిసాన్’, నేడు ‘మిషన్ భగీరథ’ను ఆదర్శంగా తీసుకుని ‘హర్ ఘర్ జల్ యోజన’ను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు.