telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిక్, ప్రియాంక ఫస్ట్‌డేట్‌ ఫోటో… ప్రియాంక భావోద్వేగ పోస్ట్

Nick

హాలీవుడ్‌ నటుడు, పాప్‌గాయకుడు నిక్‌జోనస్‌తో సుదీర్ఘ ప్రేమాయణం నడిపిన ప్రియాంకచోప్రా రెండేళ్ల క్రితం అతన్ని పెళ్లాడింది. నిక్‌జోనస్‌తో వివాహం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భర్తతో కలిసి తొలిసారి తీయించుకున్న సెల్ఫీని ప్రియాంకచోప్రా సోషల్‌ మీడియాలో పంచుకుంది. ‘రెండేళ్ల క్రితం మనిద్దరం కలిసి తొలిసారి ఫొటో దిగాం. నాటి నుంచి నా జీవితం అనంతమైన ఆనందోత్సాహాలతో సాగిపోతోంది. మన బ్రతుకును ఓ ఉత్తేజపూర్వకమైన అనుభవంగా మలిచిన నీకు సదా కృతజ్ఞురాలిని. మన జోడీ జీవితాంతం ఫలప్రదంగా సాగుతూ ఇలాంటి ఎన్నో జ్ఞాపకాల్ని పోగు చేసుకోవాలనుకుంటున్నా’ అని ప్రియాంకచోప్రా భావోద్వేగంగా వ్యాఖ్యానించింది. భార్య ట్వీట్‌పై నిక్‌జోనస్‌ స్పందిస్తూ ‘నా జీవితంలో ఈ రెండేళ్ల కాలం అద్భుతంగా సాగింది. మనం ఫస్ట్‌డేట్‌కు వెళ్లిన రోజులు మరపురానివి. నీతో జీవితాన్ని పంచుకోవడం ఓ ఆశీర్వాదంలా భావిస్తున్నా. ఐ లవ్‌ యూ బేబి’ అని పేర్కొన్నారు.

Related posts