telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో కపిల్ దేవ్ బయోపిక్ ’83’

83

కపిల్ దేవ్ బయోపిక్ ’83’ ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు అమెజాన్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో కపిల్ గా రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన సతీమణి రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొనే కనిపించనుంది. ఈ జంట పెళ్ళికి ముందు చాలా సినిమాల్లో నటించారు. కానీ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విష్ణు ఇందుకూరి, షాజిద్ నడియావాలా, కబీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ వైరస్ కారణంగా ఇప్పుడప్పుడే థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే దర్శక నిర్మాతలు కూడా సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట.

Related posts