telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్‌ బేవకూఫ్… : నాగబాబు

Nagababu

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. ఇక సుడిగాలి సుధీర్… జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అత్యధిక అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా సుడిగాలి సుధీర్ కొత్త ఎపిసోడ్‌కు చెందిన ప్రొమో సోషల్ మీడియాల హల్ చల్ చేస్తోంది. ఇందులో నాగబాబు సుధీర్‌పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సరికొత్త స్కిట్ చేశారు. ఇందులో చిరంజీవి ఇంద్రసేనా రెడ్డి పాత్రలో గెటప్ శ్రీను కనిపిస్తే.. పవన్ కల్యాణ్ పాత్రలో సుడిగాలి సుధీర్ సందడి చేశాడు. పవన్ గెటప్‌లో స్టేజ్‌పైకి వచ్చిన సుడిగాలి సుధీర్‌ను పవన్ కల్యాణ్‌గా నాగబాబుకు రాం ప్రసాద్ పరిచయం చేస్తాడు. సుడిగాలి సుధీర్ గురించి పవన్ గెటప్‌లో ఉన్న సుధీర్ పొగుడుతుండగా.. నాగబాబు అడ్డు తగిలి… సుడిగాలి సుధీర్‌ బేవకూఫ్… అంటారు. అంతటితో ఆగకుండా.. సుధీర్‌కు ఏదో ప్రాబ్లమ్ ఉంది అందుకే పెళ్లి కావడం లేదని చెబుతారు. సుధీర్ ముద్దు పెడితి సెప్టిక్ అవుతుందంటూ నాగబాబు అనగానే… అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుతారు. నాగబాబు కామెంట్స్‌తో సుధీర్ ఒక్కసారిగా షాక్ తింటారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రొమోనే ఇంత బావుంటే… షో ఇంకెంతా బావుంటుందోనని గురువారం కోసం ఆసక్తికరంగా బుల్లితెర జబర్దస్త్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

Related posts