మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నలబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా ప్రభావం కారణంగా హోల్డ్‌లో పడింది. సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవి దేవదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఓ పురాతన ఆలయం సెట్‌ను వేయిస్తున్నారట మేకర్స్. ముందుగా ఏదైనా గుడిలో షూటింగ్ చేద్దామనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితిలో అది కుదిరేలా లేదు దాంతో ఆలయం సెట్ వెయ్యాలని నిర్ణయించారట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.