telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో యంగ్ హీరో కీలకపాత్ర ?

NBK

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో బీబీ3కి వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలయ్య 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదలైప్పటి నుండి రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా లయ్య- బోయపాటి సినిమా లో సమరసింహా రెడ్డి సినిమా రేంజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని… ఆ సినిమాలో పృథ్వి క్యారెక్టర్ మాదిరిగానే ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని తెలుస్తుంది . ఈ రోల్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ను తీసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నారట బోయపాటి . గతంలో ఈ ఇద్దరి కాంబినేషనలో ‘జయజానకీనాయక’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కాగా.. గతంలో రెండు సినిమాలు సింహ, లెజెండ్ వచ్చిన విషయం తెలిసిందే.

Related posts