telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నిజంగా సోనూసూద్ ‘సూపర్ హీరో’ – మంత్రి కేటీఆర్

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇండ్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. కరోనా సెకండ్ వేవ్ లోనూ సోనూ సూద్ చాలా మందికి సేవలు చేస్తున్నారు. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు.  ఇటు కేటీఆర్.. కూడా తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు.  అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అని… కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే.. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడిని, త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తున్నాను. సూప‌ర్ హీరో తాను కాదు. సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవ‌చ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.  

Related posts