telugu navyamedia
సినిమా వార్తలు

హీరో విక్రమ్‌కు గుండెపోటు..ఆస్పత్రిలో చికిత్స

ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ గుండెపోటుకు గురయ్యారు.దీంతో కుటుంబ సభ్యులుహుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని కుటుంబసభ్యులు, ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం యాంజియోథెరపీ చికిత్స నిర్వహించినట్లు తెలిపారు.

కాగా, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు

భాషతో సంబంధం లేకుండా విక్రమ్ తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటు తెలుగులోనూ విక్రమ్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ‘అపరిచితుడు’ చిత్రంతో విక్రమ్‌ తెలుగువారికి ఎంతో చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలై తెలుగువారికి మ‌రింత ద‌గ్గ‌ర‌చేశాయి.

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వం-1 సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం చెన్నైలో రిలీజ్ కానుంది. ఆకార్యకమానికి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

పొన్నియన్ సెల్వం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. సెప్టెంబర్ 3న దక్షిణాదిభాషలతో పాటు హిందీలోకూడా విడుగల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు

Related posts