telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్పైసీ రోల్ లో అనసూయ…!

Anasuya-bharadwaj tollywood

ప్రముఖ దర్శకుడు కృష్ణ‌వంశీ తాజాగా “రంగమార్తాండ” అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. విశాఖ‌పట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటుండ‌గా… చిత్ర షూటింగ్‌ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి వ‌చ్చే ఏడాది రిలీజ్‌కి సిద్ధం చేయాల‌ని కృష్ణ‌వంశీ భావిస్తున్నార‌ట‌. చిత్రంలో బ్ర‌హ్మానందం, అనసూయ భరద్వాజ్ కీల‌క పాత్రలలో నటిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోంది ఈ చిత్రం. ఈ సినిమాలో అనసూయ ఓ సరికొత్త పాత్రలో కనిపించనుందట. ఓ స్పైసీ రోల్‌లో మెరవనుందట. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కృష్ణవంశీ వెల్లడించాడు. “అనసూయతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండే అనసూయ `రంగమార్తండ`లో ఓ స్పైసీ రోల్‌లో కనిపించనుంది” అని కృష్ణవంశీ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం`లో రంగమ్మత్తగా నటించి అందరి ప్రశంసలూ అందుకుంది హాట్ యాంకర్ అనసూయ. ఆ సినిమాతో బోలెడంత పాపులారిటీ వచ్చినప్పటికీ వరుసగా సినిమాలు చేసెయ్యకుండా ఆచితూచి అడుగులేస్తోంది.

Related posts