సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక స్పృహ స్వభావం గల నటుడు. అటు వరుసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ స్టార్ గా దూసుకుపోతూ, ఇటు రియల్ లైఫ్ లో కూడా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ రియల్ సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ వారి కుటుంబాలలో ఆనందం నింపుతున్నారు సూపర్ స్టార్. అయితే తాజాగా మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు. తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించుకున్నారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. ఖర్చులన్నీ మహేష్ భరించుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. కాగా.. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. జనవరి నుండి షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తుంది.
previous post
next post
“అర్జున్ రెడ్డి” దర్శకుడిపై సెలెబ్రిటీలు ఫైర్… వివరణ ఇచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా