telugu navyamedia
సినిమా వార్తలు

‘హరిహర వీరమల్లు’లో ఆకీరా గ్రాండ్ ఎంట్రీ..!

సినీ రంగంలో న‌ట వారసుల ఎంట్రీ కొత్త కాక‌పోవ‌చ్చు.కానీ స్టార్ వారి న‌ట వారుసుల‌తో క‌లిసి సిల్వ‌ర్ స్కీన్‌పై సంద‌డి చేస్తే అభిమానుల‌కు పండ‌గే..

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న న‌టిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో పవన్ తనయుడు అకిరా నంద‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 60 % పూర్తి చేసుకుని..కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుపెట్టుకోబోతుంది.

Akira Nandan Act In Harihara Veera Mallu Movie/manatelangana.news

అకీరా నంద‌న్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో మెగా అభిమానులంత పండగ చేసుకునే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతోంది.

పవన్​ ‘హరిహర వీరమల్లు’లోని ఓ కీలకపాత్ర కోసం ఇతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నప్పటి పవన్ కల్యాణ్​గా అకీరా నటించనున్నాడట. ఆరడగులకుపైగానే ఎత్తున్న అకీరా . కర్రసాము చేస్తూ కొన్నాళ్ల క్రితం ఓ వీడియోలో కనిపించాడు. ఇతడి వెండితెర అరంగేట్రం ఎప్పుడా అని పవర్​స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలో నిజం ఎంత ఉన్నది తెలియదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు'లో అకీరా నందన్..?

ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధీ అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తుండ‌గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts